ములాయం, కృష్ణ, కృష‍్ణంరాజులకు పార్లమెంట్‌ నివాళి

Parliament Pays Tribute To Superstar Krishna Krishnamraju Mulayam - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌, టాలీవడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్‌ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. 

మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్‌ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్‌ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top