మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌ | Indian national arrested in Pakistan | Sakshi
Sakshi News home page

మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌

May 21 2017 4:57 PM | Updated on Aug 20 2018 4:30 PM

మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌ - Sakshi

మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసిన పాక్‌

పాకిస్తాన్‌లో మరో భారతీయుడిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మరో భారతీయుడిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేవన్న కారణంతో ఇస్లామాబాద్‌లోని ఎఫ్‌-8 ప్రాంతంలో ఆదివారం ఓ భారతీయుడిని అధికారులు అరెస్ట్‌ చేశారని సమా టీవీ వెల్లడించింది.

విదేశీ చట్టం ఆర్టికల్‌ 14 కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అరెస్ట్‌ అయిన భారతీయుడిని 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించిన సమా టీవీ.. అతడికి సంబంధించిన ఇతర వివరాలను మాత్రం తెలపలేదు. గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాక్‌ కోర్టు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేయాలని కోరిన నేపథ్యంలో.. మరో భారతీయుడిని పాక్‌ అరెస్ట్‌ చేయడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement