కరోనా : చైనాను దాటిన భారత్‌ | India Reported New 3970 Corona Positive Cases | Sakshi
Sakshi News home page

దేశంలో 3,970 పాజిటివ్‌ కేసులు

May 16 2020 10:00 AM | Updated on May 16 2020 11:02 AM

India Reported New 3970 Corona Positive Cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,970 కొత్త పాజిటివ్‌ కేసులతో పాటు, వైరస్‌ సోకి 103 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరింది. ఇక ఇప్పటివరకు 30,153 మంది డిశ్చార్జ్ కాగా, 2,752 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 53,035 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో భారత్‌ చైనాను దాటింది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదు కాగా భారత్‌లో 85,940 కేసులు నమోదయ్యాయి. (లాక్‌డౌన్‌ 4.0: అమిత్‌ షా కీలక భేటీ)

దీంతో ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. అయితే మరణాల పరంగా చూస్తే చైనా కన్నా భారత్‌ కొంత తక్కువ మరణాలు సంభవించడం ఊరటకలిగిస్తోంది. వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 4,633 మంది మరణించగా.. మన దేశంలో 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46.19 లక్షలు దాటింది. వైరస్‌ సోకి 3.08 లక్షల మంది మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 17.54 లక్షల మంది  కోలుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement