ఆకలి అంతస్తులోనూ మనదే ముందు..

India got Hundred Rank in Global Hunger index

సాక్షి, న్యూఢిల్లీ : ఆసియాలోనే బలమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకుపోతున్నామని, చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశంగా భారత్‌ గణతికెక్కుతుందని భావిస్తున్న తరుణంలో అత్యంత దారిద్య్ర దేశంగా అంటే ఆకలిగొన్న దేశంగా భారత్‌ కీర్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ‘గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌’లో భారత్‌ వందవ స్థానాన్ని ఆక్రమించింది. పిల్లల ఆకలిని నిర్మూలించడంలో మన ఇరుగు, పొరగైన బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలకన్నా వెనకబడి ఉన్నాం. మనకన్నా పాకిస్తాన్‌ మరింత వెనకబడి ఉందనికొని సంతప్తి పడాలేమో!

దేశంలో పిల్లల మరణాలు, వారిలో పౌష్టికాహార లోపాలు, ఎత్తుకుతగ్గ బరువు, వయస్సు తగ్గ పొడువు (ఎదుగుదల)అన్న నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ ఆకలి–సూచికను రూపొందించారు. మొత్తం 119 వర్ధమాన దేశాల్లో అధ్యయనం జరిపి ఈ సూచికను రూపొందించగా భారత్‌కు 100వ స్థానం లభించింది. అన్నింటికన్నా ఆనందించాల్సిన విషయం ఏమిటంటే 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలి శాతం తగ్గుతూ వచ్చింది. ఈ 17 ఏళ్ల ప్రపంచవ్యాప్తంగా సరాసరి 27 శాతం తక్కగా భారత్‌లో 18 శాతం తగ్గింది.

1992 నాటి నుంచి చూస్తే భారత్‌లో ఆకలి శాతం ఎక్కువ తగ్గిందని చెప్పవచ్చు. అప్పడు దేశంలో ఆకలి శాతం 46.2 శాతం ఉండగా, అది 2000 సంవత్సరం నాటికి 38.2 శాతానికి ఇప్పటికీ 31.4 శాతానికి తగ్గింది. 119 దేశాల్లో ఒక్క చైనాలోనే 71 శాతం ఆకలి తగ్గిపోయింది. పిల్లల పోషక విలువల్లో కూడా భారత్‌ ఇరుగు, పొరుగుకన్నా వెనకబడి పోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top