జాబ్ పర్మినెంట్ చేయాలంటూ మహిళ..

Guest lecturers get their head tonsured in Bhopal - Sakshi

సాక్షి, భోపాల్: గత కొంతకాలం నుంచి తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ సమస్యలను వినడం లేదంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. రాజధాని భోపాల్‌లో వందలాది గెస్ట్ లెక్చరర్లు సమావేశమై తమ డిమాండ్ల సాధన కోసం చర్చించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేవరకూ ఆందోళనను విరమించేది లేదని, తమ పోరాటాన్ని మరింత ఉధృత చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ మహిళా గెస్ట్ లెక్చరర్ గుండు కొట్టించుకుని (శిరోముండనంతో) నిరసన తెలిపారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేస్తున్నా, ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని మా మహిళా లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్ సింగ్ ఇప్పటికైనా తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపించాలని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top