విమానాలకు ‘గగన్ ’ తప్పనిసరి | Govt Likely To Make GAGAN Aricrafts Mandatory For Airlines | Sakshi
Sakshi News home page

విమానాలకు ‘గగన్ ’ తప్పనిసరి

Feb 25 2017 1:54 AM | Updated on Sep 5 2017 4:30 AM

కొత్తగా అభివృద్ధి చేసిన ‘గగన్’ నేవిగేషన్ వ్యవస్థ ఆధారిత విమానాలనే విమానయాన సంస్థలు ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరిచేస్తూ కేంద్రం త్వరలో నోటిఫికేషన్‌ జారీచేసే వీలుంది.

న్యూఢిల్లీ: కొత్తగా అభివృద్ధి చేసిన ‘గగన్’ నేవిగేషన్  వ్యవస్థ ఆధారిత విమానాలనే విమానయాన సంస్థలు ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరిచేస్తూ కేంద్రం త్వరలో నోటిఫికేషన్‌ జారీచేసే వీలుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపింది.

ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సంయుక్తంగా రూ.774 కోట్ల ఖర్చుతో గగన్ (జీపీఎస్‌ ఎయిడెడ్‌ ఆగ్‌మెంటెడ్‌ నేవిగేషన్ )ను రూపొందించాయి. ఈ విధానంతో ఎయిర్‌లైన్స్  కార్యకలాపాల సామర్థ్యం పెరిగి, వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలన్నింటికి కలిపి సుమారు 450 విమానాలున్నాయి. అయితే గగన్ కు మారాలంటే విమానయాన సంస్థకు భారీగా  వ్యయం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement