దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!

దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!


దూరదర్శన్ ఛానల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం శుక్రవారం నాడు లేవనెత్తింది. ప్రభుత్వ ప్రసారకర్త అయిన ఛానల్ను ఈ రకంగా దుర్వినియోగం చేయడం సరికాదని సీపీఎం విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్ను వాడుకున్నారని పార్టీ ఓ ప్రకటనలో విమర్శించింది.జాతీయ ప్రజా ప్రసారకర్తకు ఆర్ఎస్ఎస్ లాంటి ఓ మతవాద సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రచారం చేయడం తప్ప మరో పని ఏమీ లేదా అని ప్రశ్నించింది. మోదీ సర్కారు ప్రజా ప్రసారకర్త ఛానల్ను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top