వర్తకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు
Aug 19 2017 7:34 PM | Updated on Sep 12 2017 12:30 AM
సాక్షి, న్యూఢిల్లీ: వర్తకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) ఫైలింగ్‌లో దేశవ్యాప్తంగా వర్తకులు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఐదు రోజులు పెంచింది. ఆఖరి తేదీ రేపటితో(ఆగస్టు 20) తో ముగుస్తున్న క్రమంలో ఆగస్టు 25 వరకు ఈ గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. పన్ను చెల్లింపులకు కూడా చివరి తేదీ ఆగస్టు 25నేనని పేర్కొంది. రిటర్నులకు చివరి తేది ముగస్తుండంతో, జీఎస్టీ ఫైలింగ్ వెబ్‌సైట్ కొంత సమయం పనిచేయడం ఆగిపోయింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్తకులకు జీఎస్టీ వెబ్‌సైట్‌లో సమస్యలు ఏర్పడటం ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు అసలు సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో వర్తకులు ఆందోళనకు గురయ్యారు. వారి ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జీఎస్టీ రిటర్నుల గడువులను పెంచింది.
Advertisement
Advertisement