శ్రీనగర్‌లో ఆజాద్‌ | Ghulam Nabi Azad to visit Srinagar | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో ఆజాద్‌

Sep 22 2019 5:49 AM | Updated on Sep 22 2019 5:49 AM

Ghulam Nabi Azad to visit Srinagar - Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ శ్రీనగర్‌ను సందర్శించారు. లాల్‌ దేడ్‌ ఆస్పత్రిలోని రోగులను పరామర్శించి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల పర్యటనలో, రెండో రోజైన శనివారం ఆయన స్థానికులను కలుసుకొని ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఉన్న పరిస్థితుల గురించి వాకబు చేశారు. సొంత రాష్ట్రమైన కశ్మీర్‌ చేరుకోవాలని ఆయన గతంలో ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement