శ్రీనగర్: సరిగ్గా ఏడు నెలల తర్వాత జమ్మూకాశ్మీర్ లోయల్లోని ప్రజలు మరోసారి భయాందోళనలోకి కూరుకుపోయారు.
శ్రీనగర్: సరిగ్గా ఏడు నెలల తర్వాత జమ్మూకాశ్మీర్ లోయల్లోని ప్రజలు మరోసారి భయాందోళనలోకి కూరుకుపోయారు. అసలే మంచుపర్వతాలు, విరిగి పడుతున్న కొండచరియలు, దానికి తోడు ఎడతెరిపి లేని వర్షాల ఫలితంగా ఉప్పెనలా పొంగుకొస్తున్న వరదలతో వారు వణికి పోతున్నారు. గత మూడు రోజులుగా అకాల వర్షం కారణంగా జమ్మూకాశ్మీర్లోని పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. కాస్తంత ఒరిపినిచ్చినట్లు ఇచ్చిమరోసారి వర్షం మొదలవడంతో వరదల ఉధృతి మరింత పెరిగింది.
మరోమూడు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు తప్పవని, ఫలితంగా వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే ప్రమాదస్థాయిని మించి పొర్లిన జీలం నది కాస్త శాంతించి ప్రవహిస్తుందని, మళ్లీ రానున్న వర్షాల కారణంగా మరోసారి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అదేశించడమే కాకుండా వారికోసం రక్షణ చర్యలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసింది. తమ పరిస్థితిని ఊహించుకొని ప్రజలు మాత్రం వరదల భయంతో వణికిపోతున్నారు.