నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’ | Drunk Bengaluru girl assaults cops in Tamil Nadu, arrested | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’

Aug 24 2016 10:18 AM | Updated on Sep 4 2017 10:43 AM

నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’

నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’

మద్యం మత్తులో బైకు నడిపి, ఎస్‌ఐపై దాడికి పాల్పడిందో బెంగళూరు యువతి.

వేలూరు: మద్యం మత్తులో బైకు నడిపి, ఎస్‌ఐపై దాడికి పాల్పడిందో బెంగళూరు యువతి. అదే సమయంలో తన ప్రియుణ్ని ముద్దాడుతూ వెకిలిచేష్టలు చేసింది. ఈ ఘటన  తమిళనాడులోని వేలూరులో జరిగింది. తుత్తిపట్టుకు చెందిన వివేకానందన్, బెంగళూరుకు చెందిన యువతి అర్చన ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. ప్రియుడిని కూర్చోబెట్టుకుని ఆమె నిర్లక్ష్యంగా బైక్ నడిపింది. దీన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తికి దాడికి పాల్పడింది.

ఆమెకు సముదాయించేందుకు వేలూరు కోట వద్ద ఎస్‌ఐ రామ్‌కుమార్ ప్రయత్నించారు. ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసి, ప్రియుడిని ముద్దుపెట్టుకుంటూ హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లోనూ మహిళా ఎస్ఐపై అర్చన దాడి చేసింది. ఆమె ప్రియుడు ఫర్నీచర్ ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement