ముగిసిన డిగ్గీ రాజా నర్మదా యాత్ర

Digvijay Singh concludes Narmada Yatra - Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేపట్టిన ‘నర్మదా యాత్ర’ సోమవారంతో ముగిసింది. దేశంలో పురాతన నదిగా పేరొందిన నర‍్మదా నది తీరంలో ఇసు​క మాఫియా చేస్తున్న దురాగతాల వల్ల నది కలుషితమవుతుందంటూ డిగ్గీ రాజా ఆరు నెలల క్రితం నర్మదా యాత్ర చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌ 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర 3300 కిలోమీటర్ల మేర సాగింది. బర్మన్‌ ఘాట్‌కి చేరుకున్న దిగ్విజయ్‌, ఆయన భార్య అమృత కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు ఆయన భార్య అమృత, మాజీ ఎంపీలు రామేశ్వర్‌ నీఖ్రా, నారాయణ్‌ సింగ్‌, ఆయన అనుచరగణం కూడా పాల్గొన్నారు.  

కాగా ఆద్యంతం మతపరమైన, సాంస్కృతిక యాత్రగా సాగిన ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సాక్ష్యాలు సేకరించడానికి దోహదపడిందని, ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top