సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు | Court issues summons to Subramanian Swamy | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు

Sep 10 2014 11:55 AM | Updated on Sep 2 2017 1:10 PM

సుబ్రహ్మణ్య స్వామి

సుబ్రహ్మణ్య స్వామి

భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే నెల 30న కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక కోర్టు సమన్స్ జారీ చేసింది.

చెన్నై: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే నెల 30న కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక కోర్టు సమన్స్ జారీ చేసింది.  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన  పరువునష్టం దావాకు సంబంధించి ఈ సమన్లు జారీ చేశారు. . తమిళనాడుకు చెందిన మత్స్యకారుల సమస్యలపై సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించినందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా,  తమిళ దినపత్రిక దినమలార్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి వాస్తవానికి విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దురుద్దేశంతో కూడిన విమర్శలు గుప్పించారని జయలలిత వేసిన పిటిషన్లో ఆరోపించారు. సిటీ కోర్టులో వేసిన ఈ కేసులో స్వామి విమర్శలు సీఎం ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నై ఎడిషన్ ప్రింటర్, పబ్లిషర్పైన, ఇంటర్వ్యూ చేసిన విలేకరిపైన కూడా  మొదటి సెషన్స్ కోర్టులో  ముఖ్యమంత్రి జయలలిత తరపున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్  8వ తేదీన పిటిషన్ దాఖలు  చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement