హస్తినలో విజయ దుందుభి మోగించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఢిల్లీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ
చాయ్ పే చర్చకు ఆహ్వానం
న్యూఢిల్లీ: హస్తినలో విజయ దుందుభి మోగించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సాయమంతా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన కేజ్రీవాల్‌కు ట్వీట్ చేశారు. ఆప్ నేతను ‘చాయ్ పే చర్చ’కు కూడా ఆహ్వానించారు. తనను అభినందించినందుకు ప్రధానికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి సాయం కావాలని మోదీని కోరారు. త్వరలోనే ప్రధానిని కలుసుకుని, ఢిల్లీకి సంబంధించిన అంశాలపై చర్చిస్తానని వెల్లడించారు.
సోనియా, రాహుల్ అభినందనలు
కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా అభినందించారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఎన్నుకున్నారని, వారి తీర్పును గౌరవిస్తామని రాహుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఒడిశా సీఎం, బేజేడీ నేత నవీన్ పట్నాయక్ తదితరులు కూడా కేజ్రీవాల్‌ను అభినందించారు.