నేడు మోదీని కలవనున్న చంద్రబాబు | Chandrababu naidu to invite PM narendra modi to Krishna puskaras | Sakshi
Sakshi News home page

నేడు మోదీని కలవనున్న చంద్రబాబు

Aug 5 2016 3:44 AM | Updated on Aug 15 2018 2:30 PM

నేడు మోదీని కలవనున్న చంద్రబాబు - Sakshi

నేడు మోదీని కలవనున్న చంద్రబాబు

కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలవనున్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను చంద్రబాబు కలవనున్నారు.

మరోవైపు టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 12.20 కి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ప్రధానితో చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement