కోవిడ్‌-19 : వైద్య సిబ్బందికి శిక్షణ

Centre Launches IGOT' Training Module For COVID-19 Warriors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారినపడిన రోగులకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి చికిత్స అందించే వైద్య సిబ్బందికి సుశిక్షితమైన శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం సమగ్ర ప్రభుత్వ ఆన్‌లైన్‌ శిక్షణ (ఐగాట్‌) పోర్టల్‌ను గురువారం ప్రారంభించింది. కోవిడ్‌-19ను దీటుగా ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది సామర్ధ్యాలను మెరుగుపరిచేలా మానవవనరుల అభివృద్ధి విభాగానికి చెందిన దీక్ష ప్లాట్‌ఫాంపై ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌, పారిశుద్ధ్య సిబ్బంది, టెక్నీషియన్లు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర, రక్షణ రంగ అధికారులు, పోలీసలు, ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధులు, స్కౌట్స్‌ ఇతర వాలంటీర్లకు ఈ శిక్షణ అందిస్తారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరు ఉధృతం చేసేందుకు పెద్దసంఖ్యలో వైద్య సిబ్బంది, అనుబంధ రంగాలకు చెందిన వారితో పాటు ఇతర వాలంటీర్ల సేవలు అవసరమైన క్రమంలో ఐగాట్‌ ద్వారా పెద్దసంఖ్యలో కోవిడ్‌-19 పోరాటయోధులను సంసిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 5734కు చేరగా, 472 మంది కోలుకోగా, 166 మంది మరణించారు.

చదవండి : ‘కోవిడ్‌-19 వెంటాడే ముప్పు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top