'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు' | BJP, RSS have stabbed Mother India in the back: Kejriwal | Sakshi
Sakshi News home page

'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'

Apr 5 2016 12:38 PM | Updated on Mar 29 2019 9:31 PM

'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు' - Sakshi

'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'

పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐను పఠాన్కోట్ దాడిని విచారించేందుకు ఒప్పుకొని బీజేపీ ప్రభుత్వం భారతమాతకు వెన్నుపోటు పొడిచిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు మిషతో పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను భారత్ లోకి అనుమతించడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరాన్ని తీవ్రతరం చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

'ఇది సిగ్గుచేటు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారు. ఇంతకు ముందున్న ప్రధానులెవ్వరూ ఇలా చెయ్యలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తున్నారు. కానీ వాళ్లే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బటికి రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలు మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement