రెచ్చిపోయిన ఎమ్మెల్యే ; మేమింతే! | BJP MLA Akash Vijayvargiya Beats Govt Officer In MP | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో ఎమ్మెల్యే వీరంగం; మేమింతే!

Jun 26 2019 2:34 PM | Updated on Jun 28 2019 1:27 PM

BJP MLA Akash Vijayvargiya Beats Govt Officer In MP - Sakshi

ఇది ఆరంభం మాత్రమేనని.. లంచగొండులను సహించేది లేదని..

భోపాల్‌ : ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించాడో ఎమ్మెల్యే. ప్రభుత్వాధికారిని కొడుతూ దురంహకారం ప్రదర్శించాడు. వివరాలు.. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఓ మున్సిపల్‌ ఉద్యోగి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా ఓ ఇంటిని కూల్చేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వార్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయి సదరు అధికారిని కొట్టడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్లు వారించినా వినకుండా క్రికెట్‌ బ్యాట్‌తో చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

కాగా ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో బీజేపీ నేత హితేశ్‌ బాజ్‌పాయ్‌ రంగంలోకి దిగారు. ప్రభుత్వ అధికారి విజయ్‌ను లంచం అడిగినందుకే ఆయన ఇలా ప్రవర్తించారని వెనకేసుకొచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని.. లంచగొండులను సహించేది లేదని తేల్చిచెప్పారు. కావాలంటే ఆకాశ్‌ను అరెస్టు చేయవచ్చని.. అయితే అంతకంటే ముందు లంచం అడిగిన అధికారిని జైళ్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement