కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష విరమించారు | BJP Lawmaker Maheish Girri Ends Hunger Strike Outside Arvind Kejriwal's House | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష విరమించారు

Jun 21 2016 6:51 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ ఎమ్మెల్యే మహీష్ గిర్రీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరహార దీక్షను విరమించారు.

న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే మహీష్ గిర్రీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరహార దీక్షను విరమించారు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ అధికారి ఎమ్ ఎమ్ ఖాన్ మరణానికి కారణం గిర్రీనేనని కేజ్రీవాల్ చేసిన ఆరోపణను నిరూపించాలని గిర్రీ ఆదివారం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

కొన్నాట్ ఫోర్ స్టార్ హోటల్ ను లీజ్ కు ఇవ్వడానికి ముందురోజు మే 16న ఎమ్ఎమ్ ఖాన్ ను దుండగులు కాల్చి చంపారు. కాగా, ఈ కేసులో హోటల్ ఓనర్ రమేష్ కక్కర్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారిని హత్య చేసిన వ్యక్తితో గిర్రీకి సంబంధాలు ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ విషయంపై రమేష్ గిర్రీ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారిని తొలగించాలని హత్యకు ముందే లేఖ రాసినట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement