దేశవ్యాప్తంగా పెరిగిన ‘మానవ’ రవాణా | Bengal Most Unsafe For Women Shows Latest Crime Records Bureau Data | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పెరిగిన ‘మానవ’ రవాణా

Dec 4 2017 5:30 AM | Updated on Dec 4 2017 5:30 AM

Bengal Most Unsafe For Women Shows Latest Crime Records Bureau Data - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2016లో 8వేలకు పైగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ ఘటనల్లో 182 మంది విదేశీయులతో సహా 23వేల మంది బాధితులను రక్షించినట్లు వెల్లడించింది.   ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం. వీటిల్లో 3,579 కేసుల(44శాతం)తో పశ్చిమ బెంగాల్‌ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్‌(1,422 కేసులు), గుజరాత్‌(548), మహారాష్ట్ర(517), తమిళనాడు(434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement