వచ్చే వారం నుంచి ‘నీతి’ షురూ! | Sakshi
Sakshi News home page

వచ్చే వారం నుంచి ‘నీతి’ షురూ!

Published Sat, Jan 3 2015 2:50 AM

వచ్చే వారం నుంచి ‘నీతి’ షురూ!

  • త్వరలో వైస్ చైర్మన్, సభ్యుల నియామకం
  • యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
  • న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ‘నీతి (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) ఆయోగ్’ వచ్చే వారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ‘నీతి ఆయోగ్’ వ్యవస్థను గురువారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

    ఇది జరిగిన కొద్దిగంటల్లోనే.. ఇప్పటివరకు ప్రణాళికా సంఘం కొనసాగిన ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఉన్న యోజన భవన్ వద్ద బోర్డుపై పేరును ‘నీతి ఆయోగ్’గా మార్చారు. ఇందులో నియామకం కాబోయే అధికారులకు అనుగుణంగా గదులను, కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. నీతి ఆయోగ్‌కు త్వరలోనే వైస్ చైర్మన్, సభ్యులను నియమించనున్న నేపథ్యంలో... వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

    దీనికి తొలి వైఎస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియాను నియమించనున్నట్లుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఐదుగురు శాశ్వత సభ్యుల నియామకం త్వరలోనే జరుగనుందని.. వారంతా వచ్చేవారం విధుల్లో చేరే అవకాశముందని కేంద్ర అధికార వర్గాల సమాచారం.
     

Advertisement
 

తప్పక చదవండి

Advertisement