ఢిల్లీ స్మార్ట్ సిటీ నిర్మాణానికి బార్సిలోనా సహకారం | Barcelona's contribution to the construction of Smart City in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ స్మార్ట్ సిటీ నిర్మాణానికి బార్సిలోనా సహకారం

Nov 20 2014 7:03 AM | Updated on Sep 2 2017 4:49 PM

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని స్మార్ట్ సిటీగా నిర్మించడంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)...

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని స్మార్ట్ సిటీగా నిర్మించడంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ)లకు సాంకేతిక సహకారం అందించడానికి స్పెయిన్‌లోని బార్సిలోనా నగర మేయర్ జేవియర్ ట్రియాస్ అంగీకరించారు. ఆయన ఆహ్వానం మేరకు బార్సిలోనాలో పర్యటిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య బుధవారం బార్సిలోనా టౌన్ హాల్‌ను సందర్శించారు. న్యూఢిల్లీ స్మార్ట్‌సిటీ నిర్మాణానికి బార్సిలోనా ప్రాంతీయ అర్బన్ డవలప్‌మెంట్ ఏజెన్సీ సాంకేతిక సహకారాన్ని అందించడానికి మేయర్ ట్రియాస్ సుముఖత వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement