ఆర్థిక మోసాలపై చర్చలకు చోటెక్కడ..?

Bank Frauds must debate in parliament, venkaiah naidu - Sakshi

న్యూఢిల్లీ:  దేశ ప్రతిష్టను కాపాడాలంటే బ్యాంకు స్కాంలు, ఇతర మోసాలపై పార్లమెంటులో చర్చ జరగాలని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అయితే చట్టసభల్లో వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండా విలువైన సభా సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం క్రెడాయ్‌ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మార్చి 5 న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మోసంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నీరవ్‌ మోదీ, చోక్సీ, విజయ్‌ మాల్యాల ఆర్థిక మోసాలతో అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మసకబారిందని వెంకయ్య అన్నారు. మోసాలు, కుంభకోణాలు ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నది కాదు...వాటిపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటన్నదే ముఖ్యమన్నారు . నల్ల కుబేరులకు రియల్‌ రంగంలో చోటివ్వొద్దని క్రెడాయ్‌ సభ్యులకు వెంకయ్య సూచించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top