‘చైనా ఊసెత్తకుండా చనాపై మాట్లాడారు’ | Asaduddin Owaisi Says Instead of China PM Spoke On Chana | Sakshi
Sakshi News home page

ప్రధాని ప్రసంగంపై అసదుద్దీన్‌ విస్మయం

Jun 30 2020 8:02 PM | Updated on Jun 30 2020 8:03 PM

Asaduddin Owaisi Says Instead of China PM Spoke On Chana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చైనాతో సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించకపోవడం పట్ల ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విస్మయం వ్యక్తం చేశారు. చైనాపై మాట్లాడాల్సిన ప్రధాని ఆ ప్రస్తావన లేకుండా చనా (పప్పుధాన్యాలు)పై మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ముగించారని ఎద్దేవా చేశారు. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్‌ గురించి సైతం ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. రానున్న నెలల్లో వచ్చే పలు పండుగల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈద్‌ గురించి మాత్రం చెప్పనేలేదని ట్వీట్‌ చేశారు.

కాగా చైనాతో సరిహద్దు వివాదంపై కేంద్రం తీరును ఓవైసీ పలుమార్లు తప్పుపట్టారు. భారత్‌లో చైనా ఆక్రమణ వివరాలను, డ్రాగన్‌ సేనల దుందుడుకు వైఖరితో మన జవాన్లకు వాటిల్లిన నష్టాన్ని స్పష్టంగా వెల్లడించాలని గతంలో అసదుద్దీన్‌ ఓవైసీ మోదీ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. చైనా సేనలతో ఘర్షణల కారణంగా భారత జవాన్ల మరణానికి దారితీసిన పరిస్ధితులను సమీక్షించేందుకు స్వతంత్ర రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

చదవండి : డ్రాగన్‌ అంతపని చేసిందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement