‘అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు’

Army Received Inputs For Terrorists Planning To Target Amarnath Yatra - Sakshi

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్‌ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్‌-చిమ్మర్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్‌ టాప్‌ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం)

‘అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్‌ వివేక్‌ సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్‌నాథ్‌ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు.    
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top