జమ్మూకాశ్మీర్‌ను ముంచెత్తిన భారీ వరదలను ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని భారత
	శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ను ముంచెత్తిన భారీ వరదలను ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ) వెంబడి దేశంలోకి చొరబడేందుకు మిలిటెంట్లు చేసిన ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టినట్టు తెలిపింది.
	
	కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు 200 మంది సాయుధ మిలిటెంట్లు సరిహద్దుల వద్ద తిష్ట వేశారని ఆర్మీ అధికారి ఒకరు  వెల్లడించారు. వరదలను అదనుగా చేసుకుని సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని, అయితే ఉగ్రవాదుల ప్రయత్నాలను సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. జవాన్ల కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదార్లు హతమయ్యారన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
