
ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం
మొగుడిని కొట్టి మొగసాలకెక్కడాన్ని చూశాం. మొగుడు కాకుండానే కొట్టి మొగసాలకెక్కడమంటే ఇదేనేమో?
ఒకమ్మాయి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నా ప్రియుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నన్ను రేప్ చేశాడు,' అని పోలీసులకు చెప్పుకుని భోరుమంది. దాంతో పోలీసులు హుటాహుటిన రంగప్రవేశం చేశారు. దర్యాప్తు చేయడం మొదలుపెట్టే సరికి కథలో ట్విస్టులే ట్విస్టులు! దాంతో ఆశ్చర్యపడిపోవడం పోలీసుల వంతైంది.
అమ్మాయి లక్నోలోని తేలీబాగ్ లో ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది. ఆమెకి ఆలమ్ బాగ్ లో ఉండే ఒక అబ్బాయితో దోస్తీ. అతను లా విద్యార్థి. ఇద్దరి మధ్య గత ఆరేళ్లుగా లవ్ నడుస్తోంది... కాదు కాదు పరుగులు తీస్తోంది. ఆదివారం అబ్బాయి అమ్మాయి కలుసుకోవాలనుకున్నారు. అబ్బాయి అమ్మాయి పనిచేసే షాపింగ్ మాల్ కివచ్చాడు. రావద్దు గాక రావద్దంది అమ్మాయి. కానీ అబ్బాయి వచ్చేశాడు. అతనికి అమ్మాయి ఇంకొకరితో సినిమా చూస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై లా పాయింట్లు లేవదీశాడు అబ్బాయి.
*దాంతో అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది. అసలు సంగతి అర్థమయ్యాక ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించండి అని శాంతి సందేశమిచ్చి పంపించేశారుపోలీసులు.
*మొగుడిని కొట్టి మొగసాలకెక్కడాన్ని చూశాం. మొగుడు కాకుండానే కొట్టి మొగసాలకెక్కడమంటే ఇదేనేమో?