వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది! | anger! to Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది!

Aug 12 2014 2:56 AM | Updated on Mar 18 2019 9:02 PM

వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది! - Sakshi

వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది!

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి కోపమొచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌నేత మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై సోమవారం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి కోపమొచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌నేత మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై సోమవారం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రంటైసెస్ సవరణ బిల్లును స్థాయీసంఘానికి పంపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఖర్గే.. ‘ఇలా ప్రతీ విషయంలో మొండిగా ముందుకెళ్తుంటే(బుల్డోజింగ్) ఇక పార్లమెంటు అవసరమే ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘మీరు పదేపదే ఆ పదాలు(బుల్డోజింగ్) వాడుతున్నారు. అలాంటి పదాలు ఉపయోగించడం మంచిది కాదు.’అన్నారు
 
 

Advertisement
 
Advertisement
Advertisement