డ్యాన్సింగ్‌ బామ్మ.. వీడియో చూశారంటే షాకే..! | Anand Mahindra Tweet Dancing Old Woman Brings Friday Mood | Sakshi
Sakshi News home page

ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్‌..!

Jan 3 2020 7:50 PM | Updated on Jan 3 2020 8:28 PM

Anand Mahindra Tweet Dancing Old Woman Brings Friday Mood - Sakshi

ముంబై : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర ట్విటర్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో ఆనందం అంటే ఇదేనేమో..! అనేలా ఉంది. ఓ ఆరు పదుల వయసు దాటిన మహిళ వంట చేస్తూ చలాకీగా డ్యాన్స్‌ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా మాంసాహారం తయారు చేస్తున్న ఆ బామ్మ..  ‘జిమికి కమల్‌’ పాటకు సరికొత్త స్టెప్పులతో అదరగొట్టింది. ‘మీలాగే.. నేనూ న్యూఇయర్‌ సందర్భంగా చాలా వీడియో మెసేజ్‌లు అందుకున్నా. అన్నిటిలో ఈ వీడియో నన్ను అమితంగా ఆకట్టుకుంది. అయితే, వీడియోలో ఉన్నదెవరో.. ఎవరు ఈ వీడియో తీశారో తెలియదు. కానీ, బామ్మ డ్యాన్స్‌ నన్ను పండుగ మూడ్‌లోకి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన మరుక్షణం.. బామ్మ డ్యాన్స్‌ మూమెంట్లను ప్రాక్టిస్‌ చేస్తా..!’అని ఆనంద్‌ మహింద్ర ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement