ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

AICTE not to allow low employment potential disciplines from 2020-21 - Sakshi

ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్‌ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్‌ భద్రత, 3డీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్‌ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top