ఆర్థికమంత్రి అవినీతిపై సీబీఐ విచారణ కోరరేం? | Achuthanandan takes on CPI-M over Mani's corruption | Sakshi
Sakshi News home page

ఆర్థికమంత్రి అవినీతిపై సీబీఐ విచారణ కోరరేం?

Nov 14 2014 6:01 PM | Updated on Sep 22 2018 8:22 PM

కేరళ ఆర్థికమంత్రి కేఎం మణి అవినీతిపై సీబీఐ విచారణ కోరరెందుకని సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ మండిపడ్డారు.

కేరళ ఆర్థికమంత్రి కేఎం మణి అవినీతిపై సీబీఐ విచారణ కోరరెందుకని సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు ఆయనో లేఖ రాశారు. మణి మీద సీబీఐ విచారణ కోరేందుకు పార్టీలో ఏ కమిటీ వ్యతిరేకంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని 418 బార్లను తెరిపించాలంటే 5 కోట్లు ఇవ్వాలని అడిగిన ఆర్థికమంత్రి మణి, కోటి రూపాయలు తీసుకున్నట్లు ఓ బార్ యజమాని ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటినుంచే మణి రాజీనామా చేయాలని అచ్యుతానందన్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని కూడా అడుగుతున్నారు. అయితే, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్ లాంటి వాళ్లు ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. దాంతో అచ్యుతానందన్ మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement