మిగిలింది ఇక ఎనిమిది రోజులే... | 9 days to go for exchanging your pre-2005 issued banknotes | Sakshi
Sakshi News home page

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

Jun 22 2015 1:24 PM | Updated on Sep 3 2017 4:11 AM

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

మిగిలింది ఇక ఎనిమిది రోజులే...

2005 సం.రానికి ముందు ముద్రించబడిన 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇంక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

న్యూఢిల్లీ:    2005 సంవత్సరానికి ముందు  ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లను  మార్చుకోవడానికి ఇక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది.  కొన్ని భద్రతా కారణాల రీత్యా 2005కు ముందు ఉన్నఈ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు గతంలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)  ప్రకటించింది. ఆయా నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుగా 13 నెలల గడువు విధించింది. అయితే జనవరి 1 ముగిసిన ఈ గడువున జూన్‌ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరు లోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని  సూచించింది.  ఎవరి దగ్గరైనా  అలాంటి నోట్లు ఉంటే దేశవ్యాప్తంగా ఉండే  ఏ  ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి, దానికి సమానమైన నోట్లను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక  సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది.

కాగా  విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ నోట్లను నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధన ప్రవేశపెట్టింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని పేర్కొంది. వాటి వెనుకవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉండదని, ఇక ముందు ముద్రించే  నోట్లకు కింద సంవత్సరం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement