ఉగ్రవాద దాడులు జరగొచ్చు: హై ఎలర్ట్


మధ్యప్రదేశ్ జైలు నుంచి 2013లో పారిపోయిన ఐదుగురు సిమి ఉగ్రవాదులు.. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు మనదేశంలోభారీగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఐబీ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హై ఎలర్ట్ పంపింది. మహ్మద్ ఐజాజుద్దీన్, మహ్మద్ అస్లాం, అమ్జాద్ ఖాన్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మహబూబ్ గుడ్డు.. ఈ ఐదుగురికి ఈ ఉగ్రదాడులు చేసే బాధ్యతను అప్పగించినట్లు తెలిసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎలర్ట్ పంపినా.. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. ఇక్కడే ఉగ్రవాదులు దాక్కుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.



ఐఎస్ఐ హ్యాండ్లర్లు పంపిన ఓ సందేశాన్ని భారత నిఘా వర్గాలు ఇంటర్సెప్ట్ చేశాయి. అందులో.. ''వాళ్లకు మంచి ప్రాజెక్టు ఇచ్చాం. కొన్ని రోజులు వేచి చూడు'' అని ఉంది. చిట్టచివరి సారిగా ఈ ఐదుగురు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ల గ్యాంగ్ లీడర్ ఫైజల్తో కలిసి ఈ ఐదుగురు 2013 అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి 14 అడుగుల ఎత్తున్న గోడ దూకి పారిపోయారు. వీళ్లు కొంతకాలం తెలంగాణ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న జరిగిన బ్యాంకు దోపిడీలో కూడా వీళ్ల పాత్ర ఉందని అనుమానం వ్యక్తమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top