బస్సు రిజర్వాయర్లో పడి 22 మంది మృతి | 12 killed in Himachal bus accident | Sakshi
Sakshi News home page

బస్సు రిజర్వాయర్లో పడి 22 మంది మృతి

Sep 24 2014 12:20 PM | Updated on Sep 2 2017 1:54 PM

హిమాచల్ప్రదేశ్లో బిలాస్పూర్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో బిలాస్పూర్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు గోవింద్ సాగర్ రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని ప్రయాణికులంతా గాయపడ్డారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రిజర్వాయర్లో పడిపోయిన బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సంగతి తెలియదని చెప్పారు. రుషికేష్ నుంచి బిలాస్పూర్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. బస్సులో ప్రయాణికులంతా స్థానికులేనని ఎస్పీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement