దమ్ముంటే ఇలా బాటిల్‌ మూత తీయండి.. | YouTube Sensation Bhuvan Bams Hilarious Execution Of Bottle Cap Challenge | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఇలా మూత తీయండి..

Jul 5 2019 3:50 PM | Updated on Jul 5 2019 5:06 PM

YouTube Sensation Bhuvan Bams Hilarious Execution Of Bottle Cap Challenge - Sakshi

మొన్న ఐస్‌ బకెట్‌, నిన్న కికి చాలెంజ్‌... నేడు బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌. సామాజిక మాధ్యమాల్లో కొత్త చాలెంజ్‌ రావడానికి ఎంత సమయం పడుతుందో కానీ అది ట్రెండ్‌ అవడానికి అర క్షణం చాలు..! ఇంటర్నెట్‌లో ప్రస్తుతం బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ హవా నడుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దీని వెంటపడుతున్నారు. ఇది హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎందరో నటులు ఈ చాలెంజ్‌కు సై అంటూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ప్రస్తుతం గల్లీబాయ్‌ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిద్ధాంత్‌ చతుర్వేది ఈ సవాలును స్వీకరించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి బాలీవుడ్‌ నటుడిగా నిలిచారు.

ఇక యూట్యూబ్‌ స్టార్‌ భువన్‌ బామ్‌ కూడా తనదైన స్టైల్‌లో కాసింత హాస్యాన్ని జోడించి మరీ బాటిల్‌ క్యాప్‌ తీశాడు. స్లో మోషన్‌లో ఉన్న ఈ వీడియోలో భువన్‌ కాలితో తన్నకుండా చివర్లో నోటితో తీస్తాడు. భువన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. ‘నీలా ఎవరూ చేయలేరు.. నీకు నువ్వే సాటి’ అంటూ బాలీవుడ్‌ నటులు జాన్వీకపూర్‌-ఇషాన్‌ ఖట్టర్‌, సిద్ధాంత్‌లు ప్రశంసలు కురిపించారు. భువన్‌. బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ పూర్తి చేయాలంటూ హార్దిక్‌ పాండ్యా, విక్కీ కౌశల్‌, అమాండసెర్నీలకు ట్యాగ్‌ చేశారు.

‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’లో బాటిల్‌ మూతను ముందుగానే కాస్త వదులు చేసి ఉంచుతారు. ఆ తర్వాత కాలితో తన్ని బాటిల్‌ మూతను తీయాలి.. అదీ బాటిల్‌ కిందపడకుండా! బాలీవుడ్‌లో మొదటగా ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సిద్ధాంత్‌ దాన్ని పూర్తి చేయడమే కాక నటుడు ఇషాన్‌ ఖట్టర్‌కు సవాలు విసిరాడు.మరోవైపు హాలీవుడ్‌ నటుడు జేసన్‌ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అక్షయ్‌ కుమార్‌ సైతం ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అక్షయ్‌ ఒక్క తన్నుతో బాటిల్‌ మూతను గాలిలో గింగిరాలు తిప్పి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. మరో నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో ఏమో! ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. టైగర్‌ చేసిన ఈ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement