ఇప్పటికి ఇంకా 20 ఏళ్లే! | Yet 20 years old! | Sakshi
Sakshi News home page

ఇప్పటికి ఇంకా 20 ఏళ్లే!

Jun 16 2015 11:53 PM | Updated on Sep 3 2017 3:50 AM

ఇప్పటికి ఇంకా 20 ఏళ్లే!

ఇప్పటికి ఇంకా 20 ఏళ్లే!

‘ఆకాశమంత’ చిత్రం తర్వాత త్రిష మళ్లీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయలేదు. తాజాగా, ఒక విభిన్నతరహా చిత్రంలో ఆమె

‘ఆకాశమంత’ చిత్రం తర్వాత త్రిష మళ్లీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయలేదు. తాజాగా, ఒక విభిన్నతరహా చిత్రంలో ఆమె నటించనున్నారు. తమిళ దర్శకుడు గోవర్ధన్ సారథ్యంలో హారర్, కామెడీ చిత్రంలో త్రిష విలక్షణంగా కనిపించనున్నారు. ఇందులో ఆమె పోషించనున్న పాత్రకు రెండు పార్శ్వాలుంటాయట. అందుకోసం చాలా కష్టపడుతున్నారు త్రిష. సినిమాలో కాసేపు 20 ఏళ్ల కాలేజీ అమ్మాయిగా త్రిష కనిపిస్తారు. దర్శకుడు ఆ సంగతి చెప్పగానే 6 కిలోలు తగ్గడానికి సిద్ధమైపోయారు.

ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. చిత్రం ఏమిటంటే, సినిమాలో అదే పాత్ర కొన్ని సన్నివేశాల తరువాత పెరిగిన వయసుతో, పరిణతితో కనిపిస్తుంది. దాని కోసం త్రిష మళ్లీ పది కిలోలు పెరగాల్సి ఉంటుంది. మొత్తం మీద త్రిషను తన  గత చిత్రాల కంటే  భిన్నంగా ఆమెను కొత్తగా చూపించాలని దర్శకుడు గోవర్ధన్ ప్రయత్నం. త్రిష కూడా దాన్ని ఆ ఛాలెంజ్‌గా తీసుకున్నట్లే ఉంది. చూద్దాం... 20 ఏళ్ళ బాలా కుమారిగా త్రిష ఎలా కనువిందు చేస్తారో!

Advertisement
 
Advertisement
Advertisement