సమ్మర్‌లో సూపర్‌ హీరోల హంగామా!

Will Avengers: Infinity War Introduce an All-New Vision? - Sakshi

‘స్పైడర్‌’ సినిమాలోని ‘బూమ్‌ బూమ్‌’ పాట గుర్తుందిగా? ‘గుర్తుంది సరే! హాలీవుడ్‌ సినిమా న్యూస్‌లోకి మహేశ్‌ ఎందుకొస్తాడు?’ అనేగా మీ డౌట్‌! అక్కడే ఉంది అసలు విషయం. ‘బూమ్‌ బూమ్‌...’ పాటలో ‘మార్వెల్‌ కామిక్సే వీణ్ని చూసినాక  రాశారేమో!’ అనే లైన్‌ గుర్తుందిగా? మార్వెల్‌ కామిక్స్‌ అంత పాపులర్‌ మరి! ఆ కామిక్స్‌ నుంచి పుట్టుకొచ్చిన సినిమాలూ అంతే!  సూపర్‌ హీరోలంతా ఓ దగ్గర చేరి చేసే హంగామా నుంచి పుట్టిన ‘అవెంజర్స్‌’కు మార్వెల్‌ కామిక్స్‌లో, సినిమాల్లో ఓ సెపరేట్‌ క్రేజ్‌ ఉంది.

అవెంజర్స్‌ సిరీస్‌లో ‘ది అవెంజర్స్‌’ (2012) ‘ది అవెంజర్స్‌ – ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ (2015) సినిమాలకు సీక్వెల్‌గా 2018లో ‘అవెంజర్స్‌ – ఇన్ఫినిటీ వార్‌’ అనే సినిమా వస్తోంది. ట్రైలర్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ సినిమా అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌ ‘అవెంజర్స్‌’ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మే 4, 2018న సినిమా విడుదలవుతోంది.

అంటే.. మనకు సరిగ్గా సమ్మర్‌ టైమ్‌. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని మనమే ముందు చూడబోతున్నాం. ఎందుకంటే ఏప్రిల్‌ 27న ఇండియాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆంథోని, జాయ్‌ రుస్సో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. రాబర్ట్‌ డొనీ, జాష్‌ బొర్లిన్, మార్క్‌ రఫాలో తదితర స్టార్‌ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top