
ఖుషి హీరోకి గ్రీన్ సిగ్నల్!
‘ఖుషి’ అనగానే పవన్ కల్యాణ్, భూమిక గుర్తొచ్చారా? వారిద్దరూ మరోసారి సందడి చేస్తే చూడ్డానికి బాగుంటుం దని సంబరపడిపో తున్నారా?
‘ఖుషి’ అనగానే పవన్ కల్యాణ్, భూమిక గుర్తొచ్చారా? వారిద్దరూ మరోసారి సందడి చేస్తే చూడ్డానికి బాగుంటుం దని సంబరపడిపో తున్నారా? అయితే మేము చెబుతున్నది తమిళ ‘ఖుషి’ జంట విజయ్, జ్యోతిక గురించి. ఈ ఇద్దరూ జంటగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏయం. రత్నం నిర్మించిన తమిళ ‘ఖుషి’ పదహారేళ్ళ క్రితం 2000లో విడుదలైంది. ఆ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ కల్యాణ్, భూమిక జంటగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేశారు రత్నం. ఆ సంగతి అలా ఉంచితే... ‘ఖుషి’ తర్వాత విజయ్–జ్యోతిక ‘తిరుమలై’ అనే చిత్రంలో జంటగా నటించారు.
ఈ చిత్రం విడుదలై పధ్నాలుగేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఇద్దరూ కలసి సినిమా చేయలేదు. ఇప్పుడు ఒక సినిమాలో నటించనున్నారని భోగట్టా. అయితే జంటగా కాదు. విజయ్ హీరోగా అట్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కాజల్, సమంత కథానాయికలనీ... ముఖ్యపాత్రలో జ్యోతిక నటించనున్నారనీ టాక్.