బ్లాక్‌బస్టర్‌ గిఫ్ట్‌ లోడ్‌ అవుతోం‍ది!

Vijay Devarakonda Tie Up With Majili Director For A New Films - Sakshi

‘హ్యాపీ బర్త్‌ డే రాజు సార్‌.. మీకు కోసం బ్లాక్‌ బస్టర్‌ బహుమతిని లోడ్‌ చేస్తున్నాము. ప్రేమతో శివ నిర్వాణ, విజయ్‌ దేవరకొండ’ అంటూ విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. నేడు(డిసెంబర్‌18) టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టు చేశాడు. ఇలా ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపడమే.. గాకుండా దిల్‌ రాజు ప్రొడక‌్షన్‌లో తన సినిమా రాబోతుందని చెప్పకనే చెప్పాడు ఈ రౌడీ. విజయ్‌ షేర్‌ చేసిన ఈ పోస్టులో ‘మజిలి’ దర్శకుడు శివ నిర్వాణను కూడా ట్యాగ్‌ చేశాడు. ఇది చూసి నెటిజన్లంతా ఈ ముగ్గురు కలిసి అభిమానులకు బ్లాక్‌ బస్టర్‌ను అందించడానికి రెడీ అయినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో హీట్‌లు కొట్టి.. విజయ్‌ క్రేజీ హీరో అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డియర్‌ కామ్రెడ్‌ వంటి సినిమాల చేసిన విజయ్‌కి అంతటి క్రేజీ రాలేదని చెప్పుకోవచ్చు. దీంతో మరోసారి క్రేజీ హీరో అనిపించుకుకొవాలని ఆరాటపడుతున్నాడు ఈ రౌడీ. ఈ క్రమంలో నిన్నుకోరి, మజిలీ చిత్రాల విలక్షణ దర్శకుడైన శివ నిర్వాణతో జత కడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలపై అయోమయంలో ఉన్న తన అభిమానులకు విజయ్‌ ఈరోజు ఓ క్లారిటి ఇచ్చేశాడు. హార్ట్‌ టచింగ్, ఎమోషనల్‌ డ్రామాలతో అలరించిన శివ నిర్వాణ..‘అర్జున్‌రెడ్డి’ కోసం ఎలాంటి పాత్ర సృష్టించాడో వేచి చూడాలి మరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top