రణ్‌వీర్‌ స్థానంలో రణ్‌బీర్‌ వచ్చాడా..?

Vidhu Vinod Said Ranveer Singh Is Perfect For Sanju - Sakshi

సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సంజు’. ట్రైలర్‌...ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతోనే భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోంది ఈ సినిమా. రణ్‌బీర్‌ కపూర్‌ అచ్చు సంజయ్‌ దత్‌ లాగా మారిపోయాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు రణ్‌బీర్‌. అయితే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు చిత్ర నిర్మాత విధు వినోద్‌ చోప్రా. ‘సంజు’ సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్ర కోసం మొదట రణ్‌వీర్‌ సింగ్‌ను అనుకున్నారంట. కానీ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ మాత్రం రణ్‌బీర్‌ కపూర్‌ను ‘సంజు’ పాత్ర కోసం ఎంపిక చేసారంట.

ఈ విషయం గురించి విధు ‘‘సంజు’ పాత్ర కోసం రణ్‌బీర్‌ను తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీది. కానీ నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే సంజయ్‌ పాత్రలో నేను రణ్‌వీర్‌ను అనుకున్నాను. ఈ పాత్రకు రణ్‌వీర్‌ అయితే చాలా బాగా సరిపోతాడని అనిపించింది. కానీ రాజు మాత్రం రణ్‌బీరే ఈ పాత్రకు చక్కగా సరిపోతాడని నన్ను ఒప్పించాడు.

షూటింగ్‌ ప్రారంభమయ్యాక రణ్‌బీర్‌ను సంజయ్‌ పాత్రలో చూసి నేను ఆశ్చర్యపోయాను. దాంతో నేను మొదట్లో అన్న మాటలను వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే రణ్‌బీర్‌ పూర్తిగా సంజయ్‌లాగా మారిపోయాడు. సంజయ్‌ దత్‌ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక్కోసారి సంజయ్‌ ఆత్మ రణ్‌బీర్‌లో ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అంతలా ఒదిగిపోయాడు ఆ పాత్రలో’ అని తెలిపారు.

రణబీర్‌కపూర్‌, సంజయ్‌ దత్‌ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్‌ కపూర్‌, పరేష్‌ రావల్‌, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజు భాయ్‌ పాత్రలో రణబీర్‌ కపూర్‌ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సంజయ్‌దత్‌ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top