సౌత్‌కి సై! | 'Ventilator' remake of South | Sakshi
Sakshi News home page

సౌత్‌కి సై!

Aug 3 2017 12:33 AM | Updated on Sep 17 2017 5:05 PM

సౌత్‌కి సై!

సౌత్‌కి సై!

అంటే ప్రియాంకా చోప్రా సౌత్‌ సినిమాలో కథానాయికగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనుకుంటున్నారా? అది కాదు.

 అంటే ప్రియాంకా చోప్రా సౌత్‌ సినిమాలో కథానాయికగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనుకుంటున్నారా? అది కాదు. అసలు విషయం వేరే ఉంది. కథానాయికగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న ప్రియాంకా చోప్రా భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. మరాఠీలో ఆమె నిర్మించిన ‘వెంటిలేటర్‌’ కథ సౌత్‌కి తగ్గట్టుగా ఉంటుందని, మలయాళంలో రీమేక్‌ చేస్తే బాగుంటుందనీ ఫ్రెండ్స్‌ సలహా ఇస్తే, ప్రియాంక ‘సై’ అన్నారట. ‘‘మల యాళంలో కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ వస్తుంటాయి. ‘వెంటిలేటర్‌’ రీమేక్‌ పనులన్నీ నిర్మాతగా నేను దగ్గరుండి చూసుకోబోతున్నా. ఇంకా దర్శకుడు, నటీ నటులను ఖరారు చేయలేదు’’ అని  ప్రియాంక తల్లి మధు చోప్రా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement