వెంకీకి జోడిగా మిత్రవింద | venkatesh next movie heroine kajal agarwal | Sakshi
Sakshi News home page

వెంకీకి జోడిగా మిత్రవింద

Mar 2 2016 5:54 PM | Updated on Oct 30 2018 5:58 PM

వెంకీకి జోడిగా మిత్రవింద - Sakshi

వెంకీకి జోడిగా మిత్రవింద

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. భలే భలే మొగాడివోయ్ సినిమా తరువాత మంచి...

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత మంచి ఫాంలో కనిపిస్తున్న మారుతి, వెంకీని ఫుల్లెంగ్త్ కామెడీ రోల్లో చూపించనున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు వెంకీ.

బాబు బంగారం సినిమా పూర్తయిన వెంటనే నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. మల్టీ డైమెన్షన్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్కు జోడిగా కాజల్ నటించనుంది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో మాత్రమే జోడి కట్టిన ఈ బ్యూటీ  తొలిసారిగా ఓ సీనియర్ హీరోతో నటిస్తున్నందుకు భారీ మొత్తాన్నే అందుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement