పోలిక ఉండదు

veera bhoga vasantha rayalu shooting completed - Sakshi

నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్‌ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్‌ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన నిర్మించారు. సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా అప్పారావు బెల్లాన మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన కథ చెప్పగానే సినిమా ప్రొడ్యూస్‌ చేద్దామనిపించింది. అంతగా కథ నచ్చింది. మంచి నటీనటులు కుదిరారు. సినిమాలోని నాలుగు ముఖ్య పాత్రలను ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా దర్శకుడు డిజైన్‌ చేశారు.

ఏ పాత్రకు మరో పాత్రతో పోలిక ఉండదు. ఈ సినిమా తెలుగు అండ్‌ హిందీ శాటిలైట్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడు పోయాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్‌ లోగో ఆవిష్కరణ ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసి, మూవీ రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్‌ డార్క్‌ సైడ్‌లను టచ్‌ చేసే వినూత్నమైన మల్టీస్టారర్‌ మూవీ’’అన్నారు ఇంద్రసేన. శశాంక్, చరిత్‌ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: రాబిన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top