వాసుకి వచ్చేస్తోంది | Vasuki will be released on the month 28th | Sakshi
Sakshi News home page

వాసుకి వచ్చేస్తోంది

Jul 23 2017 11:57 PM | Updated on Apr 8 2019 8:33 PM

వాసుకి వచ్చేస్తోంది - Sakshi

వాసుకి వచ్చేస్తోంది

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సంగతెలా ఉన్నా రీల్‌పై డ్రగ్స్‌ కుంభకోణాన్ని చూడనున్నాం. డ్రగ్స్, అత్యాచారం నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పుదియ నియమం’. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ సినిమా పతాకంపై ఏఆర్‌ మోహన్‌ ‘వాసుకి’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏకే సాజన్‌ దర్శకుడు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ‘‘డ్రగ్స్‌ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి దారుణానికి పాల్పడ్డారు. డ్రగ్స్‌ తీసుకున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాసుకీకి, డ్రగ్స్‌కి బానిసలైన వాళ్లకూ లింక్‌ ఏంటి? వాళ్లపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది? అనే అంశాలతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఏఆర్‌ మోహన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement