ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

Uttara Movie Trailer Launch - Sakshi

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్  క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’.  శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా  జరిగింది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర  కార్యక్రమాలు జరుపుకుంటోంది.

 ఈ సందర్భంగా  తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ లో నన్ను ఎక్కువుగా ఆకర్షించింది మ్యూజిక్. సురేష్ బొబ్బిలి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే  లుక్ అండ్ ఫీల్ చాలా ప్రెష్ గా ఉన్నాయి. తెలంగాణా యాస తెరపై గమ్మత్తును చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయం తో పాటు రెస్సెక్ట్ వస్తుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బ్యాక్ డ్రాప్ బాగుంది. కొత్త ఫీల్ కలిగింది.  స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.  సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది’ అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఏ సినిమాలో అయినా కొత్తదనం ఉంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఆదరణ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొత్తదనం నిండిన సినిమాలను ప్రొత్సహించిన వారే. మా సినిమా కూడా అలాంటి కొత్తదనం తోనే వస్తుంది. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన దర్శకుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ టీం అందరూ నన్ను బాగా ఎంకేరేజ్ చేసారు. అలాగే కారుణ్య నటన ప్రత్యేకంగా చెప్పుకుంటారు’ అన్నారు.

దర్శకుడు తిరుపతి యస్ ఆర్  మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రలు చాలా సహాజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుతుంది.  ఉత్తర సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ కారుణ్య, శ్రీరామ్‌ల పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఈ ట్రైలర్ లాంచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top