విజయ్‌కు మద్దతు తెలిపిన నిర్మాతల మండలి

Tollywood Producers Council Support To Vijay Devarakonda - Sakshi

ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం

లాక్‌డౌన్‌ తర్వాత తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లపై నిర్ణయం

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో తన ఛారిటీ చేస్తున్న సహాయక కార్యక్రమాలపై, తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లపై టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి మద్దతుగా టాలీవుడ్‌ నిలిచింది. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, రవితేజ, క్రిష్‌, కొరటాల శివ, పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌ తదితరుల నుంచి విజయ్‌కు విశేష మద్దతు లభించింది. తాజాగా చలనచిత్ర నిర్మాతల మండలి కూడా విజయ్‌కు మద్దతుగా నిలుస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌ వెబ్‌సైట్లను ఖండిస్తోంది. అసత్యంగా వార్తలు రాసే వెబ్‌సైట్లను వ్యతిరేకిస్తోంది. టాలీవుడ్‌ ప్రముఖులు విజయ్‌ దేవరకొండకు మద్దతు ఇవ్వడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తోంది. ఒక మనిషికి తన స్థోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు. దానిపై కూడా కామెంట్స్‌ చేయడం సరికాదు. సినిమా ప్రకటనలతో ఆదాయం పొందుతూ సినిమా వారిపై నెగటీవ్‌గా వార్తలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. ఈ విషయంపై లాక్‌డౌన్‌ తర్వాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎవరైనా ఫేక్‌ న్యూస్‌ రాసే వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము’అని తెలగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. 

చదవండి:
‘డియర్‌ విజయ్‌.. నేనర్థం చేసుకోగలను’
‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top