
మగాళ్లందరూ నన్ను పక్కనపెట్టేశారు!
ఆడవాళ్లు సమర్థవంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ, పెకైదిగితే మగవాళ్లకు నచ్చదా? కంగనా రనౌత్ మాటలను బట్టి అలానే అనుకోవాల్సి వస్తోంది..
ఆడవాళ్లు సమర్థవంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ, పెకైదిగితే మగవాళ్లకు నచ్చదా? కంగనా రనౌత్ మాటలను బట్టి అలానే అనుకోవాల్సి వస్తోంది. విషయం ఏంటంటే.. అప్ కమింగ్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కంగనాతో హీరోలు, ఇతర మేల్ ఆర్టిస్టులు ఫ్రెండ్లీగా ఉండేవారట. కానీ, ఇప్పుడా జాబితా తగ్గిందని కంగనా రనౌత్ చెబుతూ - ‘‘హీరోయిన్ అయిన కొత్తలో నన్ను చాలామంది ఇష్టపడేవాళ్లు. ఎంకరేజింగ్‌గా మాట్లాడేవాళ్లు. నేను సక్సెస్ అయ్యాక వాళ్లు నన్ను చూసి గర్వపడతారని, చాలా ఆనందిస్తారని ఆశించాను.
కానీ, నాకు నిరాశే ఎదురైంది. చాలామంది మగవాళ్లు నాతో మాట్లాడటం మానేశారు. నన్ను పక్కనపెట్టేశారు. ముఖ్యంగా ఒక వ్యక్తి నా ఎదుగుదలకు చాలా ఆనందపడతాడనుకున్నాను. ఎందుకంటే నేనేమీ కానప్పుడు అతను నన్ను చాలా ఇష్టపడ్డాడు. ఇప్పుడు స్టార్ అయ్యాక అతనికి కష్టమనిపించిందనుకుంటా. సరిగ్గా మాట్లాడటం మానేశాడు. మా బంధానికి కూడా ఫుల్‌స్టాప్ పడిపోయింది. అతనితో నా బంధం నిలబడాలంటే నా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ని వదిలేసుకోవాలేమో అనిపించింది. అలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్ ఉండకపోతే ఏం? అనుకున్నాను. అందుకే వదిలేశా’’ అని పేర్కొన్నారు.