తెలంగాణ త్యాగాల వీణ | the songs cd of tyagala veena was released by KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ త్యాగాల వీణ

Oct 9 2016 12:27 AM | Updated on Aug 14 2018 10:54 AM

తెలంగాణ త్యాగాల వీణ - Sakshi

తెలంగాణ త్యాగాల వీణ

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని భావి తరాల వారికి అందించాలనుకోవడం శుభ పరిణామం. మంచి ఉద్దేశంతో ‘త్యాగాల వీణ’

 ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని భావి తరాల వారికి అందించాలనుకోవడం శుభ పరిణామం. మంచి ఉద్దేశంతో ‘త్యాగాల వీణ’ చిత్రాన్ని రూపొందించినందుకు దర్శక-నిర్మాతలకు అభినందనలు. రమేష్ ముక్కెర సంగీతం వినసొంపుగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సుమన్, శివకృష్ణ, ప్రీతీ నిగమ్, మధుబాల ముఖ్య పాత్రల్లో మిర్యాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు.

 రమేష్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేసీఆర్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల తాగ్యాలను గుర్తు చేసేదే ‘త్యాగాల వీణ’.  అంతర్జాతీయంగా పేరొందిన జానపద కళాకారుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నృత్య రీతులు  హెల్ప్ అయ్యాయి’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: చింతారెడ్డి వినోద్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement