ఇంటర్నెట్‌ ఎఫెక్ట్‌! | The Effect of the Internet! | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ ఎఫెక్ట్‌!

Jan 28 2017 11:12 PM | Updated on Sep 5 2017 2:21 AM

ఇంటర్నెట్‌ ఎఫెక్ట్‌!

ఇంటర్నెట్‌ ఎఫెక్ట్‌!

ఈతరం యువత ఎక్కువగా ఇంటర్నెట్‌కి అలవాటు కావడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథతో రూపొందుతున్న సినిమా ‘ఈనాడు’.

ఈతరం యువత ఎక్కువగా ఇంటర్నెట్‌కి అలవాటు కావడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథతో రూపొందుతున్న సినిమా ‘ఈనాడు’. రామ్, వరుణ్, దివ్య, ప్రియా ముఖ్య తారలుగా నల్లూరి శ్రవణ్‌ దర్శకత్వంలో పులికొండ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత మద్దినేని రమేశ్‌ కెమేరా స్విచాన్‌ చేశారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ కె. రోశయ్య స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. ‘‘ఫిబ్రవరి రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభించి, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత రామ్‌. ‘‘కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది. ఓ ప్రముఖ హీరోయిన్‌ చిత్రంలో నటించనున్నారు’’ అని దర్శకుడు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement