అలా చేసేకన్నా సినిమాలు మానేస్తా! | The audience's interests are still different from the past .... Manjima Mohan | Sakshi
Sakshi News home page

అలా చేసేకన్నా సినిమాలు మానేస్తా!

Jun 25 2017 11:59 PM | Updated on Sep 5 2017 2:27 PM

అలా చేసేకన్నా  సినిమాలు మానేస్తా!

అలా చేసేకన్నా సినిమాలు మానేస్తా!

హీరోయిన్‌ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు.

హీరోయిన్‌ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు. లిప్‌ లాక్, బికినీ సీన్స్‌ చేసినప్పుడు కథ డిమాండ్‌ చేసిందంటుంటారు. ముద్దుగుమ్మలు ఏం చెప్పినా వినడానికి బాగుంటుంది. అయితే, మంజిమా మోహన్‌ ఇలాంటివన్నీ చెప్పనే చెప్పరు.ఎందుకంటే, ఈ బ్యూటీ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేయరట.

‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. కాగా, ‘మంజిమా లిప్‌ లాక్‌ సీన్లకు, స్కిన్‌ షో చేయడానికి రెడీ’ అనే వార్త షికారులో ఉంది. దీని గురించి మంజిమా ఘాటుగా స్పందించారు. ‘‘ప్రేక్షకుల అభిరుచుల్లో గతానికి ఇప్పటికీ తేడా వచ్చింది. గ్లామర్‌– అశ్లీలానికి తేడా వాళ్లకు తెలుసు. అందాల ప్రదర్శనకే ఇష్టపడని నేను లిప్‌ లాక్‌ సీన్లు చేస్తానని ఎలా చెబుతాను? అలాంటివి చేస్తేనే అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమే’’ అన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement